యాప్నగరం

క్రికెట్ ప్రపంచమా.. ఇదిగో ఇండియన్ ఫీల్డర్

బంతి సిక్స్‌గా వెళ్లిపోతున్న దశలో మెరుపు వేగంతో దూసుకొచ్చిన ఫీల్డర్ సంజు శాంసన్ డైవ్ చేస్తూ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే.. వేగాన్ని నియంత్రించుకోలేక తను బౌండరీ లైన్‌‌లో

TNN 18 Apr 2017, 11:28 am
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ విన్యాసాలంటే వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్ల పేర్లే ఎక్కువగా వినిపించాయి. భారత్ క్రికెటర్లు మెరిసినా.. కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేసి బంతిని అందుకున్న సందర్భాలు తక్కువనే చెప్పాలి. ఈ కొరతను తాజాగా దిల్లీ డేర్‌డెవిల్స్ ఫీల్డర్ సంజు శాంసన్ తీర్చాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయానికి చివరి 12 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన క్రిస్ మోరీస్ బౌలింగ్‌లో రెండో బంతిని మనీశ్ పాండే లాంగాన్‌లో భారీ షాట్ ఆడాడు. బంతి దాదాపు సిక్స్‌గా వెళ్లిపోతున్న దశలో మెరుపు వేగంతో దూసుకొచ్చిన ఫీల్డర్ సంజు శాంసన్ డైవ్ చేస్తూ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే.. వేగాన్ని నియంత్రించుకోలేక తను బౌండరీ లైన్‌‌లో పడిపోతుండటాన్ని గమనించిన శాంసన్ గాల్లో ఉన్నట్లే.. బంతిని మైదానంలోకి విసిరేశాడు. దీంతో ఆరు పరుగులు రావాల్సిన చోట.. కోల్‌కతాకి రెండు పరుగులే వచ్చాయి. కానీ.. చివరి ఓవర్‌లో మనీశ్ పాండే కళ్లు చెదిరే సిక్స్‌ బాది కోల్‌కతాకి ఒక బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.
Samayam Telugu ipl 2017 watch sanju samson make an unbelievable stop during dd vs kkr match
క్రికెట్ ప్రపంచమా.. ఇదిగో ఇండియన్ ఫీల్డర్



తాజా టోర్నీలో ఇప్పటికే ఏకైక శతకం బాది రికార్డు నెలకొల్పిన సంజు శాంసన్ తన ఫీల్డింగ్ విన్యాసంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. దేశవాళీలో కేరళ‌ ఆడిన ఈ యువ క్రికెటర్ కెరీర్‌లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయంలో కేరళ క్రికెట్ అసోషియేషన్ ఇతడిపై వేటు వేసే స్థాయికి వెళ్లింది. కానీ.. అన్ని కష్టాల్నీ సహనంతో ఎదుర్కొన్న ఈ క్రికెటర్.. ప్రస్తుతం దిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో కీలక ఆటగాడు. టోర్నీ ఆరంభంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన శాంసన్‌ని ఇప్పుడు ఓపెనర్‌గా ప్రమోట్ చేసి దిల్లీ జట్టు ప్రోత్సహిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.