యాప్నగరం

తగ్గేదే లేదు.. బంతిని అలానే విసురుతా

బంతి ఎంత వేగంగా విసిరినా లాభం ఉండదు.. స్వింగ్ చేయగలిగితేనే వికెట్లు పడతాయని. ఆ సిరీస్ నుంచి స్వింగ్‌పై

TNN 27 Apr 2017, 6:26 pm
మైదానంలో బంతిని స్వింగ్ చేసే విషయంలో తగ్గేదే లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన భువనేశ్వర్ 16 వికెట్లు తీసి టోర్నీలో నెం.1 బౌలర్‌గా పర్పుల్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. అయితే మునుపటితో పోలిస్తే ఈ బౌలర్ వేగం తగ్గిందని.. స్వింగ్ కోసం ఎక్కువ ప్రయత్నిస్తున్నాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన భువనేశ్వర్ బంతిని స్వింగ్ చేసే విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని వేగం గురించి అతిగా ఆలోచించనని బదులిచ్చాడు.
Samayam Telugu ipl 2017 wont compromise on swing at the cost of extra pace says bhuvneshwar
తగ్గేదే లేదు.. బంతిని అలానే విసురుతా


‘గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ సిరీస్‌లో వేగాన్ని పెంచుకుని బంతిని స్వింగ్ చేసే విషయంలో రాజీపడ్డాను. కానీ.. మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోయాను. అప్పుడే నాకు ఒకటి అర్థమైంది. బంతి ఎంత వేగంగా విసిరినా లాభం ఉండదు.. స్వింగ్ చేయగలిగితేనే వికెట్లు పడతాయని. ఆ సిరీస్ నుంచి స్వింగ్‌పై ఎక్కువ దృష్టి సారించాను. ప్రస్తుతం నా బౌలింగ్‌లో వేగం, స్వింగ్ రెండు సమపాళ్లలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. నెట్స్‌లో భిన్నరీతిలో ఎక్కువగా యార్కర్లు విసురుతూ ప్రాక్టీస్ చేస్తాను. ఆ కఠిన ప్రాక్టీస్ మైదానంలో ఉపయోగపడుతోంది’ అని భువనేశ్వర్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.