యాప్నగరం

రికార్డు ప్రయోగం తర్వాత.. అంగారక, శుక్ర గ్రహాలపైకి

104 ఉపగ్రహాలతో రికార్డు నెలకొల్పేందుకు సమాయాత్తం అవుతున్న ఇస్రో.. తదనంతరం చేపట్టనున్న ప్రయోగాలు ఇవే..

TNN 12 Feb 2017, 2:45 pm
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రికార్డు నెలకొల్పేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే మామ్ ప్రయోగంతో ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసిన ఇస్రో.. మరో ప్రయోగం ద్వారా సత్తా చాటేందుకు సమాయాత్తం అవుతోంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకూ మరే దేశమూ ఒకేసారి ఇన్ని ఉపగ్రహాలను ప్రయోగించడానికి కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. 2014లో రష్యా 37 ఉపగ్రహాలను తన రాకెట్ ద్వారా పంపడమే ఇప్పటి వరకూ అంతరిక్షంలోకి పంపడమే రికార్డు కాగా... ఇస్రో ఈ రికార్డును ఫిబ్రవరి 15న బద్దలుకొట్టనుంది. మన శ్రీహరి కోట నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు.
Samayam Telugu isro will reach to venus after mars mission
రికార్డు ప్రయోగం తర్వాత.. అంగారక, శుక్ర గ్రహాలపైకి


పీఎస్‌ఎల్‌వీ ద్వారా మూడు భారత ఉపగ్రహాలను, 101 చిన్నస్థాయి విదేశీ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. వీటిలో శాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన 88 ఉపగ్రహాలు ఉండటం విశేషం. 2021-22 నాటికి అంగారక గ్రహం మీదకు రోబోను పంపేలా ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. అంగారకుడిపైకి చేపట్టనున్న రెండో ప్రయోగం తర్వాత ఇస్రో శుక్ర గ్రహం మీదకు తన దృష్టిని మరల్చనుంది.

కేవలం పది నిమిషాల వ్యవధిలో ఇస్రో 101 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది. ఇవి ఒక దానితో మరొకటి ఢీ కొట్టకుండా స్కూల్ బస్సు నుంచి పిల్లలను తమ ఇళ్ల వద్ద ఎలా దింపుతారో అంత జాగ్రత్తగా ఒక దాని తర్వాత మరో ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి విడుదల చేయనుంది. గురుత్వాతకర్షణ శక్తి దాదాపు శూన్యంగా ఉండే స్థితిలో ఇలా చేయడం కష్టంతో కూడుకున్న పని. ఈ ప్రయోగం విజయవంతమైతే.. భవిష్యత్తులో ప్రయోగాల ద్వారా ఇస్రో మరింతగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే వీలుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.