యాప్నగరం

మత్స్యకారుల సమస్యకు ఇస్రో పరిష్కారం

చేపలను వేటాడేందుకు సముద్రంలోకి వెళ్తున్న భారత మత్స్యకారులు అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశిస్తుండటం సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు ఇస్రో రంగంలోకి దిగింది.

TNN 10 Mar 2017, 2:53 pm
చేపలను వేటాడేందుకు సముద్రంలోకి వెళ్తున్న భారత మత్స్యకారులు అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశిస్తుండటం సమస్యగా మారింది. ముఖ్యంగా తమిళ జాలర్లు శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తుండటంతో ఒకానొక దశలో ఆ దేశ ప్రధాని రానిల్ విక్రమ సింఘే తీవ్ర స్వరంతో హెచ్చరించారు కూడా. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తే.. కాల్పులు జరిపేందుకు కూడా వెనుకాడబోమని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సోమవారం లంక నేవీ జరిపిన కాల్పుల్లో భారత మత్స్యకారుడు ఒకరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఇస్రో రంగంలోకి దిగింది. భారత మత్స్యకారులు అంతర్జాతీయ జలాలను గుర్తించేందుకు వీలుగా ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉందని, మరి కొన్ని నెలల్లో రిలీజ్ చేస్తామని ఇస్రో ప్రకటించింది. నావిక్ అని పిలుస్తోన్న ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సమాచారాన్ని ఈ యాప్ ఉపయోగించుకోనుంది.
Samayam Telugu isros app to help fishermen locate international borders
మత్స్యకారుల సమస్యకు ఇస్రో పరిష్కారం


నావిక్ ఆధారిత మొబైల్ పరికరాలు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని ఆంథ్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ రాకేశ్ శశిభూషణ్ తెలిపారు. దీన్ని తమిళం ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్‌ను వాడుకునే వీలుందన్నారు.

భారత్‌లో ఆకాశయానానికి వీలుగా గగన్ అనే మరో అప్లికేషన్‌ను ఇస్రో రూపొందిస్తోంది. దీన్ని ఇస్రో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.