యాప్నగరం

ఐబీపీఎస్‌ 647 బ్యాంక్‌ జాబ్స్‌.. దరఖాస్తు విధానం ఇదే..!

IBPS Specialist Officer Recruitment 2020: ఐబీపీఎస్ ఒక నోటిఫికేషన్ ద్వారా 647 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

Samayam Telugu 18 Nov 2020, 3:21 pm
బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌. ప్రస్తుతం బ్యాంక్‌ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐబీపీఎస్ ఒక నోటిఫికేషన్ ద్వారా 647 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ పోస్టులకు ఎలా భర్తీ చేయాలో తెలుసుకుందాం.
Samayam Telugu ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్‌ (IBPS) ఇటీవల స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు నవంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ వివరాలు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో ఉంటాయి. దరఖాస్తు లింక్ కూడా ఇదే వెబ్‌సైట్‌లో ఉంటుంది.

Must read: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్‌

దరఖాస్తు విధానం:
  • ముందుగా https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • అందులో ఎడమవైపు CRP Specialist Officers లింక్ పైన క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అందులో Common Recruitment Process for Specialist Officers X లింక్ పైన క్లిక్ చేయాలి.
  • అందులో నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ లింక్ ఉంటుంది.
  • నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి వివరాలన్నీ చదవాలి.
  • అన్ని విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు లింక్ క్లిక్ చేసి అప్లయ్‌ చేయాలి.
  • దరఖాస్తు లింక్ క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
  • పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
  • ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.
  • ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫీజు చెల్లించి Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి. మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
  • అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్‌లో వస్తాయి.
  • దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం దాచుకోవాలి.

Must read: డిప్లొమా వాళ్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎన్‌సీఆర్‌టీసీ జూనియర్ ఇంజినీర్ జాబ్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.