యాప్నగరం

SBI PO JOBS 2020: ఎస్‌బీఐలో 2000 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ జాబ్స్‌.. పూర్తి వివరాలివే..!

SBI PO 2020 Notification: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Samayam Telugu 16 Nov 2020, 10:08 am
ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న భార‌త ప్ర‌భుత్వ రంగ బ్యాంకు అయిన‌‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. మొత్తం 2000 ఖాళీల్లో 200 పోస్టుల్ని ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్‌కి కేటాయించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2020 డిసెంబర్ 4 దరఖాస్తుకు చివరి తేదీ.
Samayam Telugu ఎస్‌బీఐ ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ జాబ్స్


ఈ పోస్టులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అయితే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అయ్యే సమయంలో రూ.2 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి. బాండ్ ప్రకారం అభ్యర్థులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్ల‌లో చూడొచ్చు.

Must read: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. వివరాలివే..!

ముఖ్య సమాచారం:
  • అర్హ‌త‌: గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌/ డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం చ‌దువుతున్న వారు కూడా అర్హులు.
  • వ‌య‌సు: 01.04.2020 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.
  • ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్స్ ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: డిసెంబర్‌ 04, 2020
  • ఫేజ్ 1 ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్: 2020 డిసెంబర్ 31, 2021 జనవరి 2, 4, 5
  • ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల: 2021 జనవరి మూడో వారం
  • మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2021 జనవరి మూడో వారం
  • ఫేజ్ 2 ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: 2021 జనవరి 29
  • మెయిన్ ఫలితాల విడుదల: 2021 ఫిబ్రవరి మూడోవారం లేదా నాలుగో వారం
  • వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/web/careers

నోటిఫికేషన్‌:

SBI PO 2020

Must read: పది పాసైన వారికి జాబ్స్.. ఇండియన్ కోస్టు గార్డులో నావిక్ పోస్టులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.