యాప్నగరం

APFSL : ఏపీలో ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్‌.. పూర్తి వివరాలివే

AP Jobs : ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ ఈ నోటిఫికేషన్‌ ద్వారా 10 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. ఫిబ్రవరి 23 దరఖాస్తులకు చివరితేది. వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 14 Feb 2023, 12:49 pm

ప్రధానాంశాలు:

  • ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ రిక్రూట్‌మెంట్‌ 2023
  • 10 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • ఫిబ్రవరి 23 దరఖాస్తులకు చివరితేది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu APFSL Recruitment Notification 2023
APFSL Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ - మంగళగిరిలోని ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ .. ఔట్‌సోర్సింగ్ విధానంలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. ఫిబ్రవరి 23 దరఖాస్తులకు చివరితేది. వివరాల్లోకెళ్తే..
ముఖ్య సమాచారం:
  • ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు: 10 పోస్టులు
  • విభాగాలు: ఫిజిక్స్- 03 పోస్టులు, కెమిస్ట్రీ- 02 పోస్టులు, బయాలజీ- 05.
  • అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
  • వయోపరిమితి: 01.07.2022 నాటికి 34 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
  • జీతభత్యాలు: నెలకు రూ.20,000.
  • ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, రాతపరీక్ష, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో విద్యార్హతలకు 20 మార్కులు, రాతపరీక్షకు 50 మార్కులు, పని అనుభవానికి 20 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోబొరేటరీ, నాలుగో అంతస్తు, టెక్ టవర్, మంగళగిరి, గుంటూరు.
  • దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 23.02.2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://citizen.appolice.gov.in/

నోటిఫికేషన్‌

APFSL-Lab-09.02.2023
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.