యాప్నగరం

చెన్నైలోని బెల్‌ సంస్థలో ఇంజనీర్‌ జాబ్స్‌.. రాత పరీక్ష లేదు..!

చెన్నైలోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ‌(బెల్‌).. 23 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Samayam Telugu 13 Oct 2020, 7:19 pm
భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖకు చెందిన చెన్నైలోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ‌(బెల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 23 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎల‌క్ట్రానిక్స్, మెకానిక‌ల్, ఫైనాన్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, సివిల్‌, హ్యూమ‌న్ రిసోర్సెస్‌ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈనెల 30 దరఖాస్తుకు చివరి తేది. పూర్తి వివరాలకు https://www.bel-india.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Samayam Telugu భారత్‌ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్


Must read: అమ్మాయిలకు రూ.24 వేల‌ స్కాలర్‌షిప్.. దరఖాస్తుకు ఈనెల 31 ఆఖరు తేది..!

మొత్తం ఖాళీలు: 23
  • ట‌్రెయినీ ఇంజినీర్‌-11
  • ట్రెయినీ ఆఫీస‌ర్‌-02
  • ప్రాజెక్ట్ ఇంజినీర్‌-09
  • ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌-01

ముఖ్య సమాచారం:
  • అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
  • ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, గ‌త అనుభ‌వం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: అక్టోబర్‌ 30, 2020.
  • వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

నోటిఫికేషన్‌:

bel

Also read: యూపీఎస్సీ 40 జియో సైంటిస్ట్‌ జాబ్స్‌.. ఖాళీల వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం ఇదే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.