యాప్నగరం

BEL JOBS: బెల్‌లో 33 ఇంజనీ‌ర్ జాబ్స్‌.. రాత పరీక్ష లేదు

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బెల్‌) 33 ఇంజినీర్‌/ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Samayam Telugu 8 Oct 2020, 5:32 pm
భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌).. కోట‌ద్వార‌(ఉత్త‌రాఖండ్‌) యూనిట్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న 33 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్‌ మార్కలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ ఉత్తీర్ణ‌త ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 21 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bel-india.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
Samayam Telugu భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌


Must read: డేటా సైన్స్‌ విభాగంలో 93,500 ఉద్యోగ ఖాళీలు

మొత్తం ఖాళీలు: 33
  • ట‌్రెయినీ ఇంజినీర్‌-19
  • ప్రాజెక్ట్ ఇంజినీర్-11
  • ట్రెయినీ ఆఫీస‌ర్‌-02
  • ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌-01

ముఖ్య సమాచారం:
  • అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
  • వయసు: పోస్టులను బట్టి కొన్ని పోస్టులకు 25 ఏళ్లు, మరికొన్ని 28 ఏళ్లు మించకూడదు.
  • ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కులు, అనుభ‌వం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: అక్టోబర్‌ 21, 2020.
  • వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

నోటిఫికేషన్‌:

bel

Also read: ఆర్ఈసీలో 21 ఇంజినీర్ జాబ్స్‌.. బీఈ/బీటెక్‌ అర్హత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.