యాప్నగరం

కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.. డిప్లొమా అర్హత

Cochin Shipyard Limited కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు..ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి..

Samayam Telugu 13 Dec 2019, 3:22 pm
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
Samayam Telugu CSL


Read Also: సదరన్ రైల్వేలో 3,585 అప్రెంటిస్ పోస్టులు

వివ‌రాలు..

* షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ పోస్టులు


మొత్తం ఖాళీలు: 29

విభాగాల వారీగా ఖాళీలు: మెకానిక‌ల్‌-11, ఎల‌క్ట్రిక‌ల్‌-18.

అర్హత‌: 60 శాతం మార్కులతో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. డ్రాఫ్ట్‌మెన్‌షిప్నైపుణ్యాలతోపాటు.. క్యాడ్ తెలిసి ఉండాలి.

వ‌యోపరిమితి: 20.12.2019 నాటికి 25 సంవత్సరాలకు మించ‌కూడ‌దు.

Read Also: ఇంటర్ అర్హతతో 'కేంద్ర' కొలువులు.. దరఖాస్తు చేసుకోండి


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్, ప్రాక్టిక‌ల్ పరీక్షల ఆధారంగా.

శిక్షణ, స్టైపెండ్..
ఎంపికైనవారికి రెండేళ్ల శిక్షణ ఉంటుంది. అవసరానికి అనుగుణంగా మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది.
శిక్షణ కాలంలో మొదటి సంవత్సరం నెలకు రూ.12,600; రెండో సంవత్సరం నెలకు రూ.13,800 స్టైపెండ్‌గా ఇస్తారు. అదనపు పనిగంటలకు అదనపు వేతనం ఉంటుంది.

Dont Miss: ECIL'లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు.. అర్హతలివే


ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.12.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.12.2019.

Notification

Online Application

Website


Read More . . .

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.