యాప్నగరం

DRDO RAC జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. 630 ఉద్యోగాలు.. ఉండాల్సిన అర్హతలివే

DRDO Recruitment 2022: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ), ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ)లో 630 సైంటిస్ట్‌ బీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పూర్తి వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 25 Jun 2022, 10:14 am

ప్రధానాంశాలు:

  • డీఆర్‌డీఓ ఆర్‌ఏసీ రిక్రూట్‌మెంట్‌ 2022
  • 630 ఉద్యోగాలకు ప్రకటన విడుదల
  • ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu DRDO RAC Recruitment 2022
DRDO RAC recruitment 2022 apply for 630 Scientist B Posts: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తిమార్‌పూర్ (దిల్లీ)లోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ) డీఆర్‌డీఓ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ), ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ)లో 630 సైంటిస్ట్‌ బీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉన్న అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://rac.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం:
  • మొత్తం ఖాళీలు: 630 (సైంటిస్టు-బి పోస్టులు)
  • సంస్థల వారీగా ఖాళీలు: డీఆర్‌డీఓ-579, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ)-43, డీఎస్‌టీ-08.
  • విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, నావల్‌ ఆర్కిటెక్చర్‌ తదితరాలు.
  • అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.
  • వయసు: ఆయా సంస్థల నిబంధనల ప్రకారం 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: పార్ట్‌-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్ని రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా, పార్ట్‌ 2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్ని వాలిడ్‌ గేట్‌ మెరిట్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
  • రాత పరీక్ష తేది: 16.10.2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rac.gov.in/
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.