యాప్నగరం

బీఈ/బీటెక్‌ వాళ్లకి జాబ్స్‌.. ఈసీఐఎల్‌లో 24 టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌ పోస్టులు.. రాత పరీక్ష లేదు..!

ఈసీఐఎల్‌ దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్ల‌లో 24 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Samayam Telugu 30 Oct 2020, 10:43 am
హైద‌రాబాద్ ప్ర‌ధాన ‌కేంద్రంగా ఉన్న ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌) దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్ల‌లో ఒప్పంద ప్రాతిప‌దిక 24 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 3 దరఖాస్తుకు చివరితేది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Samayam Telugu ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్


Must read: పరీక్ష రాయకుండానే జేఈఈలో టాపర్.. కొడుకు కోసం ఓ డాక్టర్ చేసిన కుట్ర బట్టబయలు..!

ముఖ్య సమాచారం:
  • పోస్టు పేరు: టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌
  • మొత్తం ఖాళీలు: 24
  • అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
  • ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కులు (బీఈ/ బీటెక్‌)లతో పాటు గ‌త అనుభ‌వం, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 23, 2020
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నవంబర్‌ 03, 2020
  • వెబ్‌సైట్‌: http://www.ecil.co.in/

నోటిఫికేషన్‌:

ecil
Also read: ఇంజనీరింగ్ స్కాలర్‌షిప్స్‌.. ఏడాదికి రూ.1,86,000 పొందే ఛాన్స్..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.