యాప్నగరం

ఈసీఐఎల్‌- హైదరాబాద్‌లో జాబ్స్‌.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ.. త్వరపడండి

ECIL Hyderabad Recruitment 2020: ఈసీఐఎల్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Samayam Telugu 30 Dec 2020, 2:44 pm
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి.
Samayam Telugu ఈసీఐఎల్‌-హైదరాబాద్


మొత్తం- 15 ఖాళీలు:
సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 4, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 2, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ పర్చేస్‌)- 1, సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్)- 2, సీనియర్ మేనేజర్ (లా)- 1, పర్సనల్ ఆఫీసర్- 1, అకౌంట్స్ ఆఫీసర్- 1 పోస్టులున్నాయి.

అర్హతలు:
పోస్టులను బట్టి వేరు వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులు కావాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు రేపు సాయంత్రం 4 గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని నోటిఫికేషన్‌లో తెలిపిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి. నార్మల్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, కొరియర్ ద్వారా అప్లికేషన్ ఫామ్ పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుల్ని పోస్టులో 2021 జనవరి 11 సాయంత్రం 4 గంటల్లోగా పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: ADDITIONAL GENERAL MANAGER & IN-CHARGE, HR PERSONNEL GROUP, ADMINISTRATIVE OFFICE, ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, ECIL (POST), HYDERABAD – 500 062, TELANGANA.

ఎంపిక ప్రక్రియ:
దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీని త్వరలో వెల్లడిస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://careers.ecil.co.in/ లేదా http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.