యాప్నగరం

HPCL Vizag: టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభం

HPCL Notification 2019 | హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌ విశాఖపట్నం రిఫైనరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది...

Samayam Telugu 23 Nov 2019, 8:09 pm
విశాఖ‌ప‌ట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 22న ప్రారంభమైంది. డిసెంబరు 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. సరైన అర్హతలు ఉన్నవారు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Samayam Telugu hpcl


మిశ్రధాతు నిగ‌మ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 72

ఆప‌రేష‌న్ టెక్నీషియ‌న్‌: 66

అర్హత: డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్)

బాయిల‌ర్ టెక్నీషియ‌న్‌: 06

2020'లో తెలంగాణ ప్రభుత్వ సెలవులు ఇవే..


అర్హత: డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్). ప్రథమ శ్రేణిలో బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఆన్‌లైన్ (డెబిట్/క్రెడిట్ కార్డు) విధానంలోనే ఫీజు చెల్లించాల్సిఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 419 ఖాళీలు


రాతపరీక్ష విధానం: రాతపరీక్షలో భాగంగా జనరల్ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. దేశవ్యాప్తంగా 5 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ముంబయి, విశాఖపట్నం, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీలో పరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.11.2019.
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 21.12.2019.

Notification

Online Application

Website

Read More . . .

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.