యాప్నగరం

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 109 జాబ్స్‌.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 109 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Samayam Telugu 4 Oct 2020, 9:36 pm
న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 109 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో స్ట్రెంత్ & కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్, ఫిజియోథెర‌పిస్ట్‌ పోస్టులున్నాయి. ఈ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 21 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://sportsauthorityofindia.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
Samayam Telugu స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా


మొత్తం ఖాళీలు: 109
  • స్ట్రెంత్ & కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్- 62
  • ఫిజియోథెర‌పిస్ట్‌-47

ముఖ్య సమాచారం:
  • అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ(స్పోర్ట్స్ & ఎక్సైజ్ సైన్స్‌/ స్పోర్ట్స్ సైన్స్/ స్పోర్ట్స్ కోచింగ్ & ఎక్సైజ్ సైన్స్‌), మాస్ట‌ర్స్ డిగ్రీ(ఫిజియోథెర‌ఫీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
  • ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: అక్టోబర్‌ 21, 2020
  • వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in/

నోటిఫికేషన్‌:

sai-21.10.2020

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.