యాప్నగరం

SSC CPO Notification 2019: ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.. డిగ్రీ అర్హత చాలు

Delhi Police, CAPFs, CISF Examination, 2019 | రెండు దశల రాతపరీక్షలు, పీఈటీ/పీఎస్‌టీ, మెడికల్ టెస్ట్ ద్వారా. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ , మెడికల్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

Samayam Telugu 18 Sep 2019, 11:48 am

ప్రధానాంశాలు:

  • సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 16 వరకు దరఖాస్తు ప్రక్రియ
  • డిసెంబరులో పేపర్-1 పరీక్ష నిర్వహణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ssc cpo
సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్-2019 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్-ఇ‌న్‌స్పెక్టర్ (ASI) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్షలు, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..

✪ ఎస్‌ఐ-ఢిల్లీ పోలీస్, ఎస్‌ఐ-సీఏపీఎఫ్, ఏఎస్‌ఐ-సీఐఎస్‌ఎఫ్ ఎగ్జామినేషన్-2019

✧ సబ్ ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ) - సీఎపీఎఫ్

పేస్కేలు: రూ.35,400 - రూ.1,12,400.

✧ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) (మెన్/ఉమెన్) - ఢిల్లీ పోలీస్

పేస్కేలు: రూ.35,400 - రూ.1,12,400.

✧ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) - సీఐఎస్‌ఎఫ్

పేస్కేలు: రూ.29,200 - రూ.92,300.

అర్హత: ఏదైనా డిగ్రీ

వయోపరిమితి: 01.01.2020 నాటికి 20-25 సంత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఆన్‌లైన్ లేదా SBI చలానా రూపంలో ఫీజు చెల్లించవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రెండు దశల రాతపరీక్షలు, పీఈటీ/పీఎస్‌టీ, మెడికల్ టెస్ట్ ద్వారా. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనికి ఎలాంటి మార్కులు ఉండవు.

రాత పరీక్ష విధానం..

✦ రెండు దశల్లో రాతపరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొదటి దశ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

✦ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ నుంచి 50 ప్రశ్నలచొప్పున మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.

✦ పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు.

✦ ఇక రెండో దశ పరీక్ష డిస్క్రిప్టివ్ (పెన్, పేపర్) విధానంలో ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌కు సంబంధించిన
200 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.

✦ హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.

శారీరక ప్రమాణాలు: పురుషుల కనీస ఎత్తు 170 సెం.మీ. చాతీ 80 నుంచి 86 సెం.మీ. ఉండాలి. మహిళల కనీస ఎత్తు 157 సెం.మీ.
ఉండాలి.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2019

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.10.2019 (17:00)

✦ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 18.10.2019 (17:00)

✦ ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేదీ: 18.10.2019 (17-00)

✦ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 19.10.2019

✦ ఆన్‌లైన్ పరీక్ష (పేపర్-1) తేదీ: 11 - 13.12.2019

✦ పేపర్-2 పరీక్ష తేదీ: వెల్లడించాల్సి ఉంది.

Notification

Online Application


'సచివాలయ' పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?


LIC Jobs: ఎల్‌ఐసీలో 8500 పైగా అసిస్టెంట్ ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రారంభం


RBI Jobs: ఆర్‌బీఐలో ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.