యాప్నగరం

Navy Jobs: విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో 275 ఖాళీలు

Indian Navy | నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్, విశాఖపట్నం అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..

Samayam Telugu 27 Nov 2019, 6:53 pm
విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్ 2020-21 బ్యాచ్‌కు సంబంధించి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతితో పాటు సంబంధింత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
Samayam Telugu VIZAG NDY


వివరాలు..

* విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్

ఖాళీల సంఖ్య: 275


▶ ఎలక్ట్రీషియన్: 29

▶ ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 32

▶ ఫిట్టర్: 29

▶ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 15

▶ మెషినిస్ట్: 19

▶ పెయింటర్ (జనరల్): 15

▶ రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్: 19

▶ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్): 23

▶ కార్పెంటర్: 23

▶ ఫౌండ్రీమ్యాన్: 07

▶ మెకానిక్ (డీజిల్): 14

▶ షీట్ మెటల్ వర్కర్: 29

▶ పైప్ ఫిట్టర్: 21

అర్హత: 50 శాతం మార్కలతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. సంబంధిత విభాగంలో 65 శాతం మార్కులతో ఐటీఐ ఉండాలి.

వయోపరిమితి: 01.04.2019 నాటికి..

➥ జనరల్ అభ్యర్థులు 01.04.1999 - 01.04.2006 మధ్య జన్మించి ఉండాలి.

➥ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 01.04.1994 - 01.04.2006 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

పరీక్ష విధానం..

➥ రాతపరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకటిన్నర మార్కులు.

➥ వీటిలో మ్యాథమెటిక్స్-20, జనరల్ సైన్స్-20, జనరల్ నాలెడ్జ్-10 ప్రశ్నలు అడుగుతారు.

➥ రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి ట్రేడ్‌కు సంబంధించిన టెక్నికల్ స్కిల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు.

➥ ఇంటర్య్యూలో అర్హత సాధించినవారికి చివరగా.. మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు . .

➥ ఆన్‌‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 05.12.2019

➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది (ఆఫ్‌లైన్): 12.12.2019

➥ రాతపరీక్ష తేది: 29.01.2020

➥ రాతపరీక్ష ఫలితాలు: 31.01.2020

➥ ఇంటర్వ్యూ తేది: 03 - 06.02.2020

➥ మెడికల్ పరీక్ష తేది: 04 - 15.02.2020

➥ శిక్షణ ప్రారంభం: 01.04.2020

Notification

Apprenticeship Registration

Website

Read More:

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.