యాప్నగరం

AP Govt Jobs: ఏపీలో 8000 ఉద్యోగాలు.. తక్షణం భర్తీకి సీఎం జగన్‌ ఆదేశం.. త్వరలో నోటిఫికేషన్లు..!

AP Jobs Notification 2022: ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ (2021-22)లో మిగిలిన సుమారు 8 వేల పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 18 Jun 2022, 8:38 am
AP Jobs Notification 2022: ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ (2021-22)లో మిగిలిన సుమారు 8 వేల పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 39,654 పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఇవి కాక ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు.
Samayam Telugu YS Jagan Mohan Reddy


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా మరో 50 వేల మందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని చెప్పారు. ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో జాబ్‌ క్యాలెండర్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్‌మెంట్, ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమగ్రంగా చర్చించారు.

Agneepath Scheme: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎందుకీ విధ్వంసం..? అగ్నిపథ్‌ స్కీమ్‌ అపోహలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. పూర్తి వివరాలివే
జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా రిక్రూట్‌ చేసిన పోస్టుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బ్యాక్‌లాక్‌ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌ను సీఎం జగన్‌ సమగ్రంగా సమీక్షించారు.

జాబ్‌ క్యాలెండర్‌లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన వాటి రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యా శాఖలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబర్‌లోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలి. నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. 16.5 శాతం పోస్టులను, అంటే సుమారు 8 వేల పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో వైద్య ఆరోగ్య శాఖలో 1,198 పోస్టులున్నాయి.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.