యాప్నగరం

ఏపీలో ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు

AP Grama Sachivalayam Jobs | ఏపీలోని గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Samayam Telugu 26 Jan 2020, 8:52 am
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. జనవరి 31తో దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే ఒకరోజు ముందుగానే ఫీజు చెల్లింపు ప్రక్రియ ముగియనుంది. అర్హతలు, పరీక్ష విధానం, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu aplogo


Read Also: ఏపీలో 570 ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు

పోస్టుల వివరాలు...

* వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్

ఖాళీల సంఖ్య: 97


జిల్లాల వారీగా ఖాళీలు..
జిల్లాఖాళీలు
శ్రీకాకుళం27
విజయనగరం14
విశాఖపట్నం08
తూర్పు గోదావరి14
పశ్చిమ గోదావరి07
కృష్ణా03
గుంటూరు03
ప్రకాశం07
నెల్లూరు00
చిత్తూరు04
అనంతపురం01
కర్నూలు08
కడప01
మొత్తం97


అర్హతలు: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.07.2O20 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

Read Also:
ఏపీలో 1134 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు.. పరీక్ష, సిలబస్ వివరాలు ఇలా


దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. నాన్‌-లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు, ఎంపిక విధానం..

*
సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*
రాతపరీక్ష ద్వారా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష, సిలబస్ వివరాలు ఇలా..

జీతం: ఎంపికైనవారికి మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.15,000 ఇస్తారు. ప్రొబేషన్ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు పనితీరు ఆధారంగా, నిబంధనల ప్రకారం వేతనం ఉంటుంది.

Read Also: ఏపీలో 762 ఉద్యోగాలు.. వీరికి ప్రత్యేకం

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31.01.2020

* దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 30.01.2020

Notification

Online Application

Read More..

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి..
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.