ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ విశాఖపట్నం జిల్లాలో 337 గ్రామ/ వార్డ్ వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏరియాల ప్రాతిపదికగా పదో తరగతి/ఇంటర్/డిగ్రీ పాసైన వాళ్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 14 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://apgv.apcfss.in/ వెబ్సైట్ చూడొచ్చు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మొత్తం ఖాళీలు: 337
మొత్తం ఖాళీలు: 337
- అర్హత: ఏరియాల ప్రాతిపదికగా పదో తరగతి/ఇంటర్/డిగ్రీ పాసై ఉండాలి. స్థానిక గ్రామం/ వార్డులో నివాసం ఉండాలి.
- వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: కింద సూచించిన అంశాలను ప్రాతిపదికగా చేసుకోని ఎంపిక ప్రకియ చేపడతారు. ఇది మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- ప్రభుత్వ పథకాలు, ప్రోగ్రాములు, సంక్షేమ పనులపై అవగాహన - 25 మార్కులు
- వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యాలయాలు/ సంస్థల్లో గతంలో పని చేసిన అనుభవం - 25 మార్కులు
- లీడర్షిప్ క్వాలిటీస్, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, జనరల్ అవేర్నెస్ - 25 మార్కులు
- సాఫ్ట్ స్కిల్స్ - 25 మార్కులు
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేది: మార్చి 14, 2021.
- నోటిఫికేషన్: https://apgv.apcfss.in/