యాప్నగరం

APPSC Recruitment 2019: ఏపీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు

అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Samayam Telugu 14 Feb 2019, 2:17 pm

ప్రధానాంశాలు:

  • మార్చి 7 నుంచి 28 వరకు దరఖాస్తుకు అవకాశం
  • 27 లోగా ఫీజు చెల్లించాలి
  • మే 22న మెయిన్ పరీక్ష నిర్వహణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu food
ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ & ఫుడ్(హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ విభాగంలో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. మార్చి 28లోగా దరఖాస్తు చేసుకోవాలి. అన్ని పోస్టులను కూడా జోన్-4 పరిధిలో భర్తీచేయనున్నారు.
రెండంచెల రాతపరీక్ష (స్క్రీనింగ్, మెయిన్) ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. దరఖాస్తుల ఆధారంగా స్క్రీనింగ్ పరీక్ష తేదీలను వెల్లడించనున్నారు. మెయిన్ పరీక్షను మే 22న నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25వేలలోపు ఉంటే.. వారికి కూడా ఆన్‌‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు.

పోస్టుల వివరాలు..

* ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 22 పోస్టులు

అర్హత‌: డిగ్రీ (ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ ఆయిల్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ సైన్స్/ వెటర్నరీ సైన్సెస్/ బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ) లేదా మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ) లేదా మెడిసిన్ డిగ్రీ.

వ‌య‌సు: 01.07.2019 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్ల రేషన్‌ కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, దేహదారుఢ్య పరీక్షలు, వైద్య ప‌రీక్షల ద్వారా ఎంపికచేస్తారు.

పేస్కేలు: రూ.28,940 - రూ.78,910.

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం07.03.2019.
ఫీజు చెల్లించడానికి చివరితేది27.03.2019.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది28.03.2019.
స్క్రీనింగ్ పరీక్ష తేదిప్రకటించాల్సి ఉంది.
మెయిన్ పరీక్ష తేది22.05.2019
undefinedనోటిఫికేషన్

వెబ్‌సైట్

✪ పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు ఇలా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.