యాప్నగరం

Sachivalayam ANM Notification: ఏపీలో 648 ఏఎన్‌ఎం ఉద్యోగాలు.. పరీక్ష, సిలబస్ వివరాలు

AP ANM Notification 2020 | ఏపీలోని గ్రామ సచివాలయాల్లో ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..

Samayam Telugu 14 Jan 2020, 1:08 pm
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం (గ్రేడ్-3) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 648 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో సంబంధిత విభాగంలో ఒకేషనల్ కోర్సులో అర్హత సాధించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
Samayam Telugu ANM


Dont Miss: 'సచివాలయ' కొలువులు ..16,207 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ

పోస్టుల వివరాలు..
* ఏఎన్‌ఎం (గ్రేడ్-3) పోస్టులు

ఖాళీల సంఖ్య: 648
జిల్లాల వారీగా ఖాళీలు..
జిల్లాఖాళీలు
శ్రీకాకుళం36
విజయనగరం46
విశాఖపట్నం81
తూర్పు గోదావరి58
పశ్చిమ గోదావరి50
కృష్ణా112
గుంటూరు34
ప్రకాశం16
నెల్లూరు57
చిత్తూరు80
కడప35
అనంతపురం12
కర్నూలు31
మొత్తం648
Dont Miss: 'సచివాలయ' ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ షురూ!

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎంపీహెచ్‌ఏ (MPHA) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంటర్‌లో రెండేళ్ల MPHW ఓకేషనల్ కోర్సు (మల్టీపర్పస్ హెల్త్ వర్కర్). ఏడాది క్లినికల్ అనుభవం కూడా ఉండాలి. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ తప్పనిసరి.

వయోపరిమితి: 01.07.2O20 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. నాన్‌-లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

Dont Miss: ఏపీలో పంచాయతీ కార్యదర్శి పోస్టులు


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.
రాతపరీక్ష, సిలబస్ వివరాలు ఇలా..

Read Also: VRO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.. పరీక్ష సిలబస్ వివరాలు ఇలా

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం11.01.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ31.01.2019
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది30.01.2019
Notification

Online Application

Read More . . .

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.