యాప్నగరం

APPSC Group 1 : గ్రూప్‌ 1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల సంఖ్య పెరిగింది.. పూర్తి వివరాలివే

APPSC : జ‌న‌వ‌రి 8న నిర్వహించే గ్రూపు-1 ప్రిలిమ్స్‌(స్క్రీనింగ్‌ టెస్ట్‌)కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. అలాగే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 7 Jan 2023, 3:19 pm
APPSC Group 1 Exam : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా జ‌న‌వ‌రి 8న నిర్వహించే గ్రూపు-1 ప్రిలిమ్స్‌(స్క్రీనింగ్‌ టెస్ట్‌)కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. 18 జిల్లాల్లో 297 కేంద్రాల్లో 1,26,499 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని.. పరీక్ష జరిగిన 3 వారాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన 92 పోస్టులకు అదనంగా 19 పోస్టులు కలిపారు. 27/2018 నోటిఫికేషన్‌ను అనుసరించి నియమించిన వారిలో కొందరు విధుల్లో చేరనుందున మిగిలిన 17 పోస్టులు.. భర్తీ కాని మరో రెండు పోస్టులను ప్రస్తుత నోటిఫికేషన్‌కు కలిపినట్లు వెల్లడించింది. కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో తాజాగా గౌతమ్‌ సవాంగ్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘గ్రూపు-1 ప్రధాన పరీక్షను స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు వెల్లడించిన 90 రోజుల్లోగా నిర్వహిస్తాం. జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలలు పడుతుంది. తర్వాత నెలలో ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోస్టుల భర్తీకి ఆమోదం లభిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో కొత్తగా మరో గ్రూపు-1 నోటిఫికేషన్‌ జారీచేస్తాం. త్వరలో గ్రూపు-2 నోటిఫికేషన్‌ ఇస్తాం’ అని గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు.
Samayam Telugu APPSC Group 1 Recruitment 2023


APPSC Group 1 Hall Ticket 2022 : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

AP Police Jobs : ఏపీలో 411 ఎస్‌ఐ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు
AP Police Recruitment 2023 : ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (SLPRB AP) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్‌ పోస్టులున్నాయి. సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు. అయితే.. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఎస్‌ఐ ఉద్యోగాలకు మాత్రం 2023 జనవరి 18వ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం, పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

AP Constable Hall Ticket 2023 : ఈనెల 9న ఏపీ కానిస్టేబుల్‌ హాల్‌టికెట్లు.. పూర్తి వివరాలివే

JNVST : నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లకు ప్రకటన విడుదల.. పూర్తి వివరాలివే
NVS Class 6 Admission 2023 : నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2023-24 విద్యాసంవత్సరాకి గాను దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయ (JNV)లో 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష- 2023 ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుకు జనవరి 31వరకు ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. వీటన్నింటిలో దాదాపు 48 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి, విద్య సదుపాయాలుంటాయి.

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.