తెలంగాణ విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా 'TSSPDCL'లో మొత్తం 2,939 ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయగా.. అందులో జూనియర్ లైన్ మెన్ 2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్(JPO) 24, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 477 ఉన్నాయి. అయితే ఈ పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు అక్టోబరు 6న ఒక ప్రకటన విడుదల చేసింది.
పోస్టుల వివరాలు..
పోస్టులు | నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులు | సవరించిన పోస్టులు |
జూనియర్ లైన్ మెన్ | 2,438 | 2500 |
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ | 24 | 25 |
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ | 477 | 500 |
మొత్తం పోస్టులు | 2,939 | 3,025 |