తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్ఓ) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 75 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన.. వాక్ ఇన్ ఇంటర్వ్యూ (మే 25 నుంచి 29 వరకు)ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://hyderabad.telangana.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 75
నోటిఫికేషన్:
dmho-H-25-05-2021
మొత్తం పోస్టులు: 75
- అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ/ ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
- వయసు: జులై 1, 2021 నాటికి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎంపిక విధానం: ఈ పోస్టులను అకడమిక్ మార్కులు, వయసు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక కమిటీ మొత్తం 100 మార్కులకు దీన్ని నిర్వహిస్తోంది. ఇందులో అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు గాను 90 మార్కులు.. వయసుకి 10 మార్కులు కేటాయిస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 25, 2021
- దరఖాస్తులకు చివరితేది: మే 29, 2021
- చిరునామా: Seminar Hall, O/o the DM&HO, 4th Floor, Harihara Kala Bhavan, Patny, Secunderabad
- వెబ్సైట్: https://hyderabad.telangana.gov.in/
నోటిఫికేషన్:
dmho-H-25-05-2021