యాప్నగరం

Telangana Jobs: తెలంగాణలో కొత్తగా 159 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివే

NHM Telangana Recruitment 2022: సికింద్రాబాద్‌లోని ఆయుష్‌ విభాగం కమిషనర్‌ కార్యాలయం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) ప్రోగ్రాం ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 159 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 26 May 2022, 5:58 pm

ప్రధానాంశాలు:

  • టీఎస్‌ ఆయుష్‌ రిక్రూట్‌మెంట్‌ 2022
  • పలు విభాగాల్లో 159 పోస్టుల భర్తీ
  • మే 31 దరఖాస్తులకు చివరితేది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Telangana Jobs 2022
Telangana Ayush Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికింద్రాబాద్‌లోని ఆయుష్‌ విభాగం కమిషనర్‌ కార్యాలయం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) ప్రోగ్రాం ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 159 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఆయుర్వేద-93, యునాని-17, హోమియోపతి-42, నేచురోపతి-07 పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానం దరఖాస్తు చేసుకోవాలి. మే 31 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ayush.telangana.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

TS Police Prelims Exam Dates 2022: తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ రాత పరీక్ష తేదీలివే..!
మొత్తం పోస్టులు: 159
  • పోస్టు పేరు: మెడికల్‌ ఆఫీసర్లు
  • విభాగాల వారీగా ఖాళీలు: ఆయుర్వేద-93, యునాని-17, హోమియోపతి-42, నేచురోపతి-07 పోస్టులున్నాయి.
  • అర్హత: ఆయుర్వేద/ హోమియో/ యునాని విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యతనిస్తారు. తెలంగాణలో పర్మినెంట్‌ రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్‌ అయి ఉండాలి. నేచురోపతికి ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయసు: 01.07.2022 నాటికి 44 ఏళ్లు మించకూడదు.
  • ఎంపిక విధానం: యూజీ డిగ్రీ పరీక్షలో (బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీఎన్‌వైఎస్‌) సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎండీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. ఇంటర్వ్యూలు లేవు.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు: రూ.600 చెల్లించాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: మే 31, 2022
  • దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: కమిషనర్‌, ఆయుష్‌ విభాగం, సికింద్రాబాద్‌, తెలంగాణ.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ayush.telangana.gov.in/

నోటిఫికేషన్‌:

TSAyush-26-05-2022
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.