యాప్నగరం

TS Govt Jobs: తెలంగాణలో మరో 1663 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంజినీరింగ్‌ చదివిన వారికి సూపర్‌ ఛాన్స్‌.. త్వరలో నోటిఫికేషన్లు విడుదల..!

Jobs in Telangana: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 1,663 కొలువుల నియామకాలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా భర్తీకి అనుమతులిచ్చిన పోస్టుల్లో 90 శాతం కొలువులు ఇంజనీరింగ్‌ కేటగిరీకి సంబంధించినవే కావడం గమనార్హం.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 3 Jul 2022, 7:48 am
TS Govt Issues Orders to Fill 1663 Job Vacancies: తెలంగాణలో ఇంజనీరింగ్‌ (Engineering) చదివిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 1,663 కొలువుల నియామకాలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా భర్తీకి అనుమతులిచ్చిన పోస్టుల్లో 90 శాతం కొలువులు ఇంజనీరింగ్‌ కేటగిరీకి సంబంధించినవే కావడం గమనార్హం.
Samayam Telugu Jobs in Telangana


CM Jagan: పుత్రికోత్సాహంలో సీఎం జగన్‌.. డియర్‌ హర్షా.. గర్వంగా ఉంది.. కూతుర్ని ఉద్దేశించి ఉద్వేగభరిత ట్వీట్.. హర్షా రెడ్డికి అభినందనల వెల్లువ
ఇరిగేషన్‌ అండ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ (ఐ– క్యాడ్‌), ట్రాన్స్‌పోర్ట్‌–ఆర్‌అండ్‌బీ, ఆర్థిక శాఖల పరిధిలోని ఈ ఖాళీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం అనుమతిచ్చిన పోస్టుల్లో ఐ–క్యాడ్‌కు సంబంధించి 1,326 ఉద్యోగాలు, ట్రాన్స్‌పోర్ట్‌–ఆర్‌అండ్‌ బీ శాఖకు సంబంధించి 284 ఉద్యోగాలు, ఆర్థిక శాఖకు సంబంధించి 53 ఉద్యోగాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అనుమతులతో కలిపి ఇప్పటివరకు 46,988 పోస్టుల భర్తీకి ఆమోదం ఇచ్చినట్లయ్యింది.

NVS Recruitment: 1616 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. TGT, PGT పోస్టులు, అర్హతల వివరాలివే
వీటిలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ద్వారా 9,526 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా.. రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు ద్వారా 18,279 ఉద్యోగాలు.. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 10,028 ఉద్యోగాలు.. జిల్లా నియామకాల కమిటీ ద్వారా 59.. తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 9,096 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వీటిలో పోలీసు (Telangana Police Recruitment), TSPSC Group 1, మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా.. మిగతా పోస్టులకు సంబంధించి ప్రకటనలు త్వరలో వెలువనున్నాయి.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.