యాప్నగరం

'విద్యుత్' కొలువుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

TSSPDCL Application 2019 | తెలంగాణ విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి TSSPDCL నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 22 Oct 2019, 7:36 pm
తెలంగాణ స్టేట్ సదరన్ వపర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌‌లో జూనియర్ లైన్‌మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం (అక్టోబరు 22) ప్రారంభమైంది. దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రక్రియ అక్టోబరు 21న ప్రారంభంకాగా.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 22న ప్రారంభమైంది.
Samayam Telugu JLM APP


Read Also: 3677 పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభం

జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉండాలి. ఇతర పోస్టులకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. నవంబరు 10 వరకు ఫీజు చెల్లించడానికి, ఆన్‌లైన్ దరఖాస్తుకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

TSSPDCLలో జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 16న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 3025 ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. వీటిలో 2500 జూనియర్‌ లైన్‌మెన్‌ (JLM) పోస్టులు, 500 జూనియర్‌ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (JACO) పోస్టులు.. అలాగే 25 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్ (JPO) పోస్టులు ఉన్నాయి.

Read Also: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో మేనేజర్ ఉద్యోగాలు

అక్టోబరు 30 నుంచి JA పోస్టులకు దరఖాస్తులు..

జూనియర్ లైన్‌మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి అక్టోబరు 30న ఫీజు చెల్లింపు ప్రక్రియ, అక్టోబరు 31న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.

నోటిఫికేషన్లు..

జూనియర్ లైన్‌మెన్ (JLM) నోటిఫికేషన్, తదితర వివరాలు..

జూనియర్ అసిస్టెంట్ (JACO) నోటిఫికేషన్, తదితర వివరాలు..

జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (JPO) నోటిఫికేషన్, తదితర వివరాలు..

Read More..
మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి..మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.