యాప్నగరం

TSLPRB Police Recruitment 2022: పోలీస్‌ ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకుంటున్నారా..? దరఖాస్తు సమయంలో ఏవైనా సమస్యలు వస్తే ఇలా చేయండి..!

Telangana Police Recruitment 2022: ఈ నెల 20న రాత్రి 10 గంటల వరకు పోలీస్‌ ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరిస్తామని పోలీస్‌ నియామక మండలి తెలిపింది. దరఖాస్తు చేసుకునే సమయంలో సమస్యలు తలెత్తితే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 4 May 2022, 11:14 am
TSLPRB Police Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1, పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. దరఖాస్తుల సమర్పణ సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు చేసుకున్న వారిలో 10 మంది అభ్యర్థులకు ఫోన్‌ చేసి ఫీడ్‌బ్యాక్‌ అడిగామని పేర్కొంది.
Samayam Telugu టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ రిక్రూట్‌మెంట్‌ 2022


వీరంతా తమ దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయడానికి 5-8 నిమిషాల మధ్య సమయం సరిపోయిందని చెప్పారని తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక.. దరఖాస్తులో ఆధార్‌ కార్డు నంబర్‌ను తప్పనిసరి చేశారు. ఒక్కో అభ్యర్థి రెండు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.

కొన్ని జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పోలీసు నియామక మండలి తెలిపింది. ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగ ఎస్సై, కానిస్టేబుల్‌, తదితర పోస్టులకు రాత పరీక్షలను హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

ఈ నెల 20న రాత్రి 10 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది. దరఖాస్తు చేసుకునే సమయంలో సమస్యలు తలెత్తితే 9393711110, 9391005006 హెల్ప్‌ లైన్‌ నంబర్లను ఫోన్‌ చేయొచ్చని.. అవి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

TSLPRB Police Recruitment 2022: మొత్తం 17291 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఈజీగా ఇలా అప్లయ్‌ చేసుకోండి
TSLPRB TS police recruitment 2022: తెలంగాణ‌లో జాబ్‌ నోటిఫికేషన్ల కోసం ఉద్యోగార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమైంది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027 (సివిల్‌ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ 390, ఫైర్‌ 610, డ్రైవర్స్‌ 100 పోస్టులున్నాయి).. ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. ఈ పోస్టులకు మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి:
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.