యాప్నగరం

TS SI Mains Answer key 2023 : త్వరలో ఎస్‌ఐ మెయిన్స్‌ ఆన్సర్‌ కీ విడుదల.. పూర్తి వివరాలివే

TS Police SI Answer Key 2023 : తెలంగాణలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి.. ఏప్రిల్ 08, 09 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలను తెలంగాణ వ్యాప్తంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించారు. వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 10 Apr 2023, 10:12 am
TS SI Mains Answer key 2023 : తెలంగాణ (Telangana)లో ఎస్‌ఐ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఫైనల్‌ రాత పరీక్షకు 96శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 08, 09 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలను తెలంగాణ వ్యాప్తంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించారు. మొదటి రోజు మ్యాథ్స్, ఇంగ్లీష్ పేపర్ (English) ను నిర్వహించగా.. ఏప్రిల్ 09వ తేదీన జనరల్ స్టడీస్ అండ్ తెలుగు పేపర్స్ పరీక్షలు నిర్వహించారు.
Samayam Telugu TS SI Mains Answer key 2023


హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లోని 81 కేంద్రాల్లో ఎస్‌ఐ రాత పరీక్ష జరిగింది. ఎస్‌ఐ( సివిల్), ఎస్‌ఐ(ఐటీ), ఎస్‌ఐ(పీటీఓ), ఏఎస్‌ఐ(ఫింగర్ ప్రింట్) విభాగంలో 4 పేపర్లకు పోలీసు నియామక మండలి (TSLPRB) పరీక్షలు నిర్వహించింది. వేలి ముద్రలతో అభ్యర్థులను సరిపోల్చిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. త్వరలోనే వెబ్‌సైట్‌ https://www.tslprb.in/ లో ప్రిలిమినరీ 'కీ' అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.

ఏప్రిల్ 08వ తేదీన.. హైదరాబాద్ లో మొత్తం 42 కేంద్రాలను కేటాయించగా.. దీనిలో 32,945 మంది హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాల్లో 18 కేంద్రాలను కేటాయించగా.. 12,833 మంది హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో 21 కేంద్రాలను కేటాయించగా.. మొత్తం 13,756 మంది హాజరయ్యారు. మొత్తం మీద 59,534 మంది హాజరయ్యారు. మొదటి రోజు 95.50 శాతంగా నమోదు అయింది. రెండో రోజు 58,019 మంది హాజరవ్వగా.. 95.47 శాతంగా నమోదైంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.