యాప్నగరం

TSSPDCL: విద్యుత్ శాఖలో 201 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. ఈ అర్హతలుంటే వెంటనే అప్లయ్‌ చేసుకోండి

TSSPDCL Sub Engineer posts: టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ 201 సబ్‌ ఇంజినీర్లు - Sub Engineer (Electrical) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జులై 5 దరఖాస్తులకు చివరితేది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 16 Jun 2022, 2:35 pm

ప్రధానాంశాలు:

  • టీఎస్‌ఎస్‌సీడీసీఎల్‌ రిక్రూట్‌మెంట్‌ 2022
  • 201 సబ్‌ ఇంజినీర్‌ పోస్టులు
  • ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu TSSPDCL SE Recruitment 2022
TSSPDCL SE Recruitment 2022: హైదరాబాద్‌లోని సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (TSSPDCL).. 201 సబ్‌ ఇంజినీర్లు - Sub Engineer (Electrical) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు డిప్లొమా (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌)/ డిప్లొమా (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌)/ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జులై 5 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://tssouthernpower.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Agnipath scheme: అగ్నిపథ్ స్కీమ్.. నెలకు రూ.40,000 వరకూ జీతం.. 4 ఏళ్ల తర్వాత రూ.12 లక్షల ప్యాకేజీ.. పూర్తి వివరాలివే
మొత్తం ఖాళీలు: 201
  • సబ్‌ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్‌)
  • అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌)/ డిప్లొమా (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌)/ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.
  • వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
  • పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్‌ ఏ లో మొత్తం 80 ప్రశ్నలు కోర్‌ టెక్నికల్‌ సబ్జెక్టు మీద ఉంటాయి. సెక్షన్‌ బి నుంచి 20 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, హిస్టరీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం నుంచి ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు: 200 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 15, 2022
  • దరఖాస్తులకు చివరి తేది: జులై 05, 2022
  • హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే తేది: జులై 23, 2022
  • పరీక్ష తేది: జులై 31, 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tssouthernpower.cgg.gov.in/

నోటిఫికేషన్‌:

Post-of-Sub-EngineerElectrical_2022
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.