యాప్నగరం

Amazon: లక్ష మంది ఉద్యోగులను తీసేసిన అమెజాన్‌.. సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి.. కారణం ఏమిటంటే..?

Amazon Layoffs: మొత్తం తమ సిబ్బంది 15 లక్షలు కాగా.. అందులో లక్ష మందిని తీసేశామని సీఈఓ ప్రకటించారు. ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌ వర్క్, ఫుల్‌ఫిల్‌ మెంట్‌ సెంటర్ ఉద్యోగులే ఎక్కువగా తొలగించినవారిలో ఉన్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 1 Aug 2022, 11:38 am
Amazon Cuts Staff by About 1 Lakh Employees: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ చరిత్రలోనే తొలిసారి భారీగా ఉద్యోగులపై వేటు వేసింది. లక్షమంది ఉద్యోగులను తొలగించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. అమెజాన్ వార్షిక ఫలితాలను వెల్లడిస్తూ ఆ సంస్థ సీఈఓ బ్రియాన్ ఒల్సావ్స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం తమ సిబ్బంది 15 లక్షలు కాగా.. అందులో లక్ష మందిని తీసేశామని సీఈఓ ప్రకటించారు.
Samayam Telugu Amazon


ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌ వర్క్, ఫుల్‌ఫిల్‌ మెంట్‌ సెంటర్ ఉద్యోగులే ఎక్కువగా తొలగించినవారిలో ఉన్నారు. తమ నష్టాలను తగ్గించుకోవడానికి ఇదొక్కటే మార్గమని తాము భావిస్తున్నామని సీఈఓ బ్రియాన్ ఒల్సావ్స్కీ చెప్పారు. గత సంవత్సరం కూడా అమెజాన్ తన ఉద్యోగులను తొలగించింది. గతేడాది అమెజాన్ 27వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది.

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కంపెనీ 14వేల మందిని హయర్‌ చేసుకున్నట్లు సీఈఓ వెల్లడించారు. ఉద్యోగుల విషయంలో సంస్థ పారదర్శకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు పలు సంస్థలు కూడా నియామకాలను తగ్గించాయి. షాపిఫై, మైక్రోసాఫ్ట్‌లు కూడా ఉద్యోగులపై వేటు వేశాయి. గూగుల్, ఫేస్‌బుక్‌లు తమ ఉద్యోగ నియామకాలను తగ్గిస్తున్నట్టు తెలిపాయి.

TSSPDCL JLM Paper Leak: తెలంగాణలో సంచలనం.. జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష పేపర్‌ లీక్‌.. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు ఒప్పందం.. ఎలా బయట పడిందంటే..?
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.