యాప్నగరం

Hyderabad లో భారీ జాబ్‌ మేళా.. టాప్‌ 30 కంపెనీలు పాల్గొంటున్నాయి.. మీ పేర్లు కూడా రిజిస్టర్‌ చేసుకోండి

AISSIMC Free Job Mela: ఫిబ్రవరి 7వ తేదీన 30 ప్రముఖ కంపెనీల ఆధ్వర్యంలో భారీ జాబ్ ఫెయిర్ జరగనుంది.

Samayam Telugu 27 Jan 2021, 12:58 pm
తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు ఆల్ ఇండియా స్మాల్ స్కేల్ మైనారిటీస్ కమిటీ(AISSIMC) శుభవార్త చెప్పింది. Francophile Frenchతో కలిసి 30 ప్రముఖ కంపెనీల ఆధ్వర్యంలో భారీ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. నిరుద్యోగులకు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కమిటీ Khud Kamao Khud Khao ప్రోగ్రామ్ కింద ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Samayam Telugu భారీ జాబ్‌ మేళా


డిగ్రీతో 10,811 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలోనూ భారీ సంఖ్యలో ఖాళీలు
ఈ జాబ్‌ ఫెయిర్‌లో Cognizant, L&T, Naukri.com, Ojha Group, Aqua-Tech తదితర టాప్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 9849932346 నంబరు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

వివరాలు:
  • తేదీ: 2021 ఫిబ్రవరి 7న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ ఫెయిర్ ఉంటుంది.
  • వేదిక: హైదరాబాద్‌- ఖైరతాబాద్ పరిధిలోని వాసవీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు.
  • ఎంపిక: అభ్యర్థులను విద్యార్హతలు, అనుభవం, మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు తక్షణమే అపాయింట్మెంట్ లెటర్లు అందించనున్నారు.
  • వెంట తీసుకెళ్లవలసిన పత్రాలు: రెండు కాపీల బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఫొటోలతో జాబ్ మేళాకు హాజరు కావాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.