యాప్నగరం

ఫ్రెషర్లకు Infosys గుడ్‌న్యూస్.. భారీగా ఉద్యోగాలు.. 55,000 కొత్త నియామకాలు

Infosys 55000 Jobs: ఇన్ఫోసిస్‌ గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం (global graduate hiring program) కింద 2022 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 55 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటున్నట్లుగా ప్రకటించింది.

Samayam Telugu 18 Jan 2022, 5:29 pm
ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ (Infosys) సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం (global graduate hiring program) కింద 2022 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 55 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ ముఖ్య ఆర్థిక అధికారి నిలంజన్ రాయ్ ప్రకటించారు.
Samayam Telugu ఇన్ఫోసిస్‌ రిక్రూట్‌మెంట్‌


Central Railway Jobs 2022: రైల్వేలో 2422 ఉద్యోగాలు.. టెన్త్‌ క్లాస్‌ పాసైతే చాలు.. పూర్తి వివరాలివే
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.5,809 కోట్ల లాభాలు గడించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు, అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చి అందుకు అనుగుణంగా ఇన్ఫోసిస్ తన పెట్టుబడులను కొనసాగిస్తోందని నిలంజన్ రాయ్ తెలిపారు. అందులో భాగంగానే గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద దాదాపు 55 వేల మంది ఫ్రెషర్స్‌ను సంస్థలో నియమించుకుంటున్నట్లు వెల్లడించారు. తాజా ప్రకటనతో కొత్తగా డిగ్రీ పూర్తి చేసి బయటికి వచ్చేవారికి, లేదా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త వినిపించినట్లయింది.

గతేడాది డిసెంబరు నాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం ఉద్యోగులు 2,92,067 మంది కాగా.. అంతకుముందు త్రైమాసికంలో 2,79,617 మంది ఉన్నారు. అదే 2020 డిసెంబరులో ఉద్యోగుల సంఖ్య 2,49,312గా ఉంది. ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ.. కంపెనీ ఉద్యోగుల ప్రతిభను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.