యాప్నగరం

రైల్వే వీల్‌ ప్లాంట్‌లో 70 జాబ్స్‌.. రాత పరీక్ష లేదు.. మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక

Indian Railway Jobs: రైల్ వీల్ ప్లాంట్ 70 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Samayam Telugu 30 Dec 2020, 10:37 pm
రైల్వే ఉద్యోగాలతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు కూడా ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. తాజాగా ఇండియన్ రైల్వేకు చెందిన రైల్ వీల్ ప్లాంట్ 70 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్, డిప్లొమా ఇంజనీర్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
Samayam Telugu రైల్వే ఉద్యోగాలు


దరఖాస్తుకు చేసుకోవడానికి 2021 జనవరి 14 చివరి తేదీ. ఈ అప్రెంటీస్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్‌సైట్‌ http://portal.mhrdnats.gov.in/ లో చూడొచ్చు. అలాగే ఈ పోస్టులకు ఇదే వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హతలు.. ఖాళీలు: 70
  • బీటెక్ లేదా బీఎస్సీ (మెకానికల్ ఇంజనీరింగ్)- 4
  • బీటెక్ లేదా బీఎస్సీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 3
  • బీటెక్ లేదా బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఐటీ ఇంజనీరింగ్)- 3
  • డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్- 35
  • డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 15
  • డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఐటీ ఇంజనీరింగ్- 10

ముఖ్య సమాచారం:
  • అర్హతలు: సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్ లేదా బీఎస్సీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
  • దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జనవరి 14
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఎంపిక విధానం: మార్కల మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష లేదు.
  • వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in/

నోటిఫికేషన్‌:

indian-railway-rail-wheel-plant-recruitment-2021

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.