యాప్నగరం

రైల్వే పరీక్షలు: ఈనెల 28 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌.. త్వరలో అడ్మిట్‌ కార్డులు

Railway Recruitment Board: డిసెంబర్ 28 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ జరగను విషయం తెలిసిందే.

Samayam Telugu 8 Dec 2020, 12:09 pm
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించే ఎన్‌టీపీసీ అభ్యర్థులకు గమనిక. డిసెంబర్ 28 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ జరగను విషయం తెలిసిందే. గతేడాది ఆర్ఆర్‌బీ 35,208 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం కూడా విధితమే. అయితే.. ఇప్పటివరకు ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించలేదు.
Samayam Telugu ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలు 2020


ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఏడాదిన్నరగా పరీక్షల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 28 నుంచి 2021 మార్చి చివరి వారం వరకు దశలవారీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. ఈ పోస్టులతో పాటు మిగిలిన పోస్టులకు కూడా డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి.

Must read: ఏపీ, తెలంగాణలో 1080 బ్యాంక్ జాబ్స్.. జిల్లాల వారీగా ఖాళీల జాబితా ఇదే..!

10 రోజుల ముందు అడ్మిట్‌ కార్టులు:
అయితే.. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులకు సంబంధించి 10 రోజుల ముందు అడ్మిట్ కార్డ్స్ విడుదల కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ మరో వారం రోజుల్లో ఆర్ఆర్‌బీ విడుదల చేసే ఛాన్స్ ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ http://www.rrbcdg.gov.in/ ఫాలో అవుతూ ఉండటం మంచిది.

Also read: ఎగ్జామ్స్ వాయిదా వేయండి.. సిలబస్ కుదించండి.. విద్యాశాఖకు విద్యార్థుల విజ్ఞప్తి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.