యాప్నగరం

రైల్వేలో 1004 జాబ్స్‌.. రాత పరీక్ష లేదు.. మార్కుల మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు

Indian Railways Recruitment 2021: రైల్వే అప్రెంటిస్‌ ఉద్యోగాల భర్తీకి నైరుతి రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది.

Samayam Telugu 5 Jan 2021, 12:51 pm
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పలు రైల్వే అప్రెంటిస్‌ ఉద్యోగాల భర్తీకి నైరుతి రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1004 ఖాళీలను భర్తీ చేయనుఇంది. ఆసక్తిగల అభ్యర్థులు హుబ్లీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) వెబ్‌సైట్ https://www.rrchubli.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Samayam Telugu రైల్వే అప్రెంటిస్‌ ఉద్యోగాలు


ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జనవరి 9 లోగా దరఖాస్తు చేసుకోవాలి. హుబ్లీ, బెంగళూరు, మైసూరు డివిజన్‌లోని క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

Must read: ఇంటర్ అర్హతతో ఉచిత విద్యతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్‌

మొత్తం ఖాళీలు- 1004
  • హుబ్లీ డివిజన్- 287
  • క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ- 217
  • బెంగళూరు డివిజన్- 280
  • మైసూరు డివిజన్- 177
  • సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు- 43

Also read: డిగ్రీ పాసైన వారికి ఆర్మీలో జాబ్స్‌.. ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

విభాగాల వారీ ఖాళీలు:
  • ఫిట్టర్- 335
  • ఫిట్టర్ (క్యారేజ్ అండ్ వేగన్)- 117
  • ఫిట్టర్ (డీజిల్ లోకో షెడ్)- 37
  • ఎలక్ట్రీషియన్ (డీజిల్ లోకో షెడ్)- 17
  • వెల్డర్- 55
  • మెషినిస్ట్- 13
  • టర్నర్- 13
  • ఎలక్ట్రీషియన్- 231
  • కార్పెంటర్- 11
  • పెయింటర్- 18
  • రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్ మెకానిక్- 16
  • ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (PASAA)- 138
  • స్టెనోగ్రాఫర్- 2

Also read: డిప్లొమా అర్హతో 305 అప్రెంటిస్ జాబ్స్.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ

విద్యార్హతల వివరాలు చూస్తే 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులు కావాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఒక ఏడాది శిక్షణ ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.