యాప్నగరం

UPSC: ఐఎఫ్‌ఎస్‌ పరీక్ష తేదీలు వెల్లడించిన యూపీఎస్సీ.. వివరాలివే

UPSC Exam Date 2020: ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌)‌ మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీలను యూపీఎస్సీ ప్రకటించింది.

Samayam Telugu 9 Dec 2020, 7:30 pm
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌)‌ మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీలను ప్రకటించింది. 2021 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 7 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అయితే మార్చి 1న పరీక్షలు లేవని వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మెయిన్‌ రాయడానికి అర్హత సాధిస్తారు.
Samayam Telugu యూపీఎస్సీ


ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్‌ 4న యూపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను అక్టోబర్‌ 23న వెల్లడించింది. అయితే తాజాగా.. మెయిన్‌ పరీక్ష తేదీలను వెల్లడించింది.

Must read: ఇంటర్‌ పాసైన వారికి 4726 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈనెల 15 ఆఖరు తేదీ

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) పరీక్షను సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత నిర్వహిస్తారు. సివిల్స్‌ మెయిన్‌ ఎగ్జామ్‌ జనవరి 8 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్‌ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. పరీక్షకు మూడు, నాలుగు వారాల ముందు హాల్‌టికెట్లు విడుదల చేస్తామని యూపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షకు 10,564 మంది అర్హత సాధించారు.

ఈ పరీక్షలో జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, జువాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, అగ్రికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, బోటనీ పేపర్లు ఉంటాయి.

Also read: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. రాత పరీక్ష లేదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.