యాప్నగరం

తడబడిన ఢిల్లీ.. కోల్‌కతా టార్గెట్ 161

వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ స్కోరు బోర్డు బాగా నెమ్మదించింది. కోరె అండర్సన్ (2) కూడా లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌తో జట్టు కష్టాలను రెట్టింపు చేశాడు

TNN 28 Apr 2017, 5:44 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్లు మళ్లీ విఫలమయ్యారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ సంజు శాంసన్ (60: 38 బంతుల్లో 4x4, 3x6), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ (47: 34 బంతుల్లో 4x4, 1x6) నిలకడగా ఆడటంతో ఒకానొక దశలో 122/1తో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. ఈ దశలో శాంసన్‌ని వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఉమేశ్ యాదవ్ ఢిల్లీకి షాకివ్వగా.. మరో 8 పరుగుల వ్యవధిలోనే రిషబ్ పంత్ (6) ఔట్ చేసి కౌల్టర్ నైల్ కోల్‌కతా శిబిరంలో ఆనందం నింపాడు.
Samayam Telugu 6 in 20 overs
తడబడిన ఢిల్లీ.. కోల్‌కతా టార్గెట్ 161


వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ స్కోరు బోర్డు బాగా నెమ్మదించింది. కోరె అండర్సన్ (2) కూడా లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌తో జట్టు కష్టాలను రెట్టింపు చేశాడు. అయితే ఒక ఎండ్‌లో శ్రేయాస్ కాసేపు పోరాడినా.. అతను స్కోరు వేగం పెంచే ప్రయత్నంలో ఔటవడంతో ఢిల్లీ భారీ స్కోరు ఆశలు వదులుకుంది. చివర్లో క్రిస్ మోరీస్ (11: 10 బంతుల్లో 1x4), అంకిత్ (11 నాటౌట్: 11 బంతుల్లో 1x4) కేవలం సింగిల్స్‌తోనే సరిపెట్టడంతో ఢిల్లీ 160కే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో కౌల్టర్ నైల్ మూడు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్ చెరో వికెట్ తీశారు. తొలి నాలుగు ఓవర్లలో 41 పరుగులు చేసిన ఢిల్లీ... 14 ఓవర్లకి 123/2తో నిలిచింది.. చివరికి 160/6కే పరిమితమవడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.