యాప్నగరం

చెల్లెలికి భోజనం పెట్టించి, బట్టలు కొనిపించి.. చంపేసిన అక్క! షాకింగ్

చెల్లెలిని తీసుకుని అక్క టౌన్‌కి వెళ్లింది. అక్కడ హోటల్‌లో భోజనం చేశాక షాపింగ్‌కి వెళ్లారు. బట్టలు కొనుక్కున్న అనంతరం తిరిగి వస్తూ చెల్లెలిని చంపేసింది.

Samayam Telugu 3 Oct 2020, 4:12 pm
ప్రియుడి బైక్‌పై చెల్లెలిని టౌన్‌కి తీసుకెళ్లిన అక్క దారుణానికి పాల్పడింది. కడుపునిండా భోజనం పెట్టించి.. బట్టలు కొనిపించి దారిలో ప్రియుడి సాయంతో కిరాతకంగా చంపేసి రైల్వే ట్రాక్‌పై పడేసింది. ఇంటి నుంచి బయటికెళ్లిన కూతుళ్లు తిరిగిరాకపోవడంతో కంగారుపడిన తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దకూతురిని గుర్తించి అదుపులోకి ప్రశ్నించడంతో దారుణం బయటపడింది. ఈ అత్యంత అమానుష ఘటన యూపీలోని మీర్జాపూర్‌లో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


మీర్జాపూర్ ఏరియాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి 15 ఏళ్లు, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు. రెండు రోజుల కిందట సైకిల్ రిపేర్ చేయించుకుని వస్తామని చెప్పి అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి బయటికి వచ్చారు. అనంతరం అక్క ప్రియుడి బైక్‌పై మీర్జాపూర్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో భోజనం చేశారు. ఆ తరువాత షాపింగ్ చేసి బట్టలు కొనుక్కున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి బయల్దేరారు.

దారిలో చెల్లెలు నిద్ర పోవడంతో అదే అదనుగా ఆమె గొంతునులిమి చంపేశారు. మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశారు. శవాన్ని ధౌరా రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపై పడేసి పరారయ్యారు. రాత్రైనా బటయటికి వెళ్లిన కూతుళ్లు ఇంటికి తిరిగిరాకపోవడంతో కంగారుపడిన తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కూతుళ్లను కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పెద్ద కూతురిని గాలించి పట్టుకున్నారు. కానీ చిన్నకూతురు ఆచూకీ లభించలేదు.

Also Read: లాక్‌డౌన్‌లో చీరల కోసం వెళ్లిన లేడీ డాక్టర్.. షాపుకి షట్టర్ వేసి.. అనంతపురంలో దారుణం

అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో ప్రశ్నించడంతో అసలు నిజం కక్కేసింది. ప్రియుడితో కలసి తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఇంట్లో తనపై సవతి ప్రేమ చూపుతున్నారని.. అందరికీ చెల్లెలంటేనే ఇష్టమని చెప్పి అసూయ వెళ్లగక్కింది. అలాగే ప్రేమ వ్యవహారంలోనూ అడ్డంకులు సృష్టిస్తోందని.. అందుకే చంపేసినట్లు చెప్పడంతో పోలీసులే షాక్‌కి గురయ్యారు. ఆమెను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.

Read Also: ప్రియుడి కోసం తల్లి, ఆస్తి కోసం కొడుకు ఘాతుకం.. చిత్తూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.