యాప్నగరం

Srikakulam: బర్త్‌డేకి పిలిచి, మత్తు మందిచ్చి.. 13ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

బాలికపై కన్నేసిన గుగ్గిలాపు రామారావు, గుగ్గిలాపు రవి పుట్టినరోజు వేడుకల పేరుతో ఆమె ఇంటికి రప్పించి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశారు.

Samayam Telugu 18 Jun 2020, 2:13 pm
పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించి 13ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మెళియాపుట్టి మండలం చాపర గ్రామంలో జరిగింది. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మతో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన గుగ్గిలాపు రామారావు, గుగ్గిలాపు రవి అనే యువకులు ఆమెతో స్నేహంగా మెలుగుతున్నారు. కొద్ది నెలల క్రితం వారిద్దరు పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికను తమ ఇంటికి రప్పించారు.
Samayam Telugu Image


Also Read: కదులుతున్న బస్సులో వివాహితపై గ్యాంగ్ రేప్.. యూపీలో దారుణం

కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి బాలికకు తాగించిన ఆ కామాంధులు ఇద్దరూ కలిసి ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కాసేపటి తర్వాత మత్తు నుంచి కోలుకున్న బాలిక వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. కొద్దిరోజుల తర్వాత తాను గర్భం దాల్చినట్లు తెలుసుకున్న బాధితురాలు అందుకు కారణమైన వారిని నిలదీసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తాని బెదిరించిన నిందితులు అబార్షన్ కావడానికి మాత్రలు మింగించారు. కాసేపటి తర్వాత జననాంగాల వద్ద తీవ్ర రక్తస్రావం కావడంతో బాలిక తన అమ్మమ్మకు విషయం చెప్పింది. దీంతో ఆమె బుధవారం పాతపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలికను చికిత్స కోసం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: కన్నబిడ్డనే గర్భవతిని చేసిన తండ్రి.. హైదరాబాద్‌లో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.