యాప్నగరం

Kadapa: వేగంగా వచ్చిన కారు.. ఒక్కగానొక్క కొడుకు బలి

బైక్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. బాలుడు కిందపడిపోయి తీవ్రగాయాలపాలయ్యాడు. కడపలో ఈ దుర్ఘటన జరిగింది.

Samayam Telugu 3 Oct 2020, 5:24 pm
వేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ని ఢీకొట్టడంతో పదిహేనేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కారు ఢీకొన్న వేగానికి బైక్‌ పై నుంచి కిందపడి బాలుడి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు విడిచాడు. జిల్లాలోని ఇనమడక గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. పదిహేనేళ్ల బాలుడు బైక్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని ఆటోలో చాగలమర్రిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృత్యువాతపడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రమాద దృశ్యాలు
accident


Also Read: యువతి శవాన్ని బయటకు లాగిన కుక్కలు.. దారుణ హత్య వెలుగులోకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.