యాప్నగరం

ఆంధ్రాబ్యాంకులో 17కిలోల బంగారం మాయం.. ఇంటి దొంగల పనేనా?

శనివారం సెలవు రోజైనా మేనేజర్‌ పురుషోత్తం బ్యాంకుకు వచ్చి విధులు నిర్వహించారని సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు తెలిపారు. ఉదయం బ్యాంకు తాళాలు తెరిచినప్పుడు తమకు ఎలాంటి అనుమానం రాలేదని, తాళాలన్నీ వేసినట్లే ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు.

Samayam Telugu 15 Oct 2019, 1:25 pm
Samayam Telugu andhra bank

చిత్తూరు జిల్లా యాదమరిలోని ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ జరిగింది. మోర్ధానపల్లి సమీపంలోని అమరరాజా పరిశ్రమ ఆవరణలో ఉన్న బ్యాంకులో రూ.3.5కోట్ల విలువూన 17కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.66 లక్షల నగదు మాయం కావడం కలకలం రేపుతోంది. బ్యాంకు తలుపులకు, లాకర్లకు వేసిన తాళాలు వేసినట్లు ఉండగానే లోపల బంగారం, నగదు మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Also Read: అర్ధరాత్రి మరిదితో శృంగారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త


బ్యాంకులో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పుటేజీకి సంబంధించిన సర్వర్ కనిపించకుండా పోవడంతో ఇది ఇంటి దొంగల పనిగా పోలీసులు భావిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం బ్యాంకు సిబ్బంది ఇచ్చిన సమాచారంతో చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌ రెడ్డి, యాదమరి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ వద్దనున్న మూడు తాళం చెవులతో లాకర్లు ఓపెన్ చేశారు. అందులో ఉన్న కొద్ది నగదును వాసన చూసిన స్నిప్పర్ డాగ్స్ హైవే పైకి వెళ్లి ఆగిపోయాయి. అత్యంత పకడ్బందీగా జరిగిన ఈ చోరీ ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తూ పోలీసులు మేనేజర్ పురుషోత్తం, క్యాషియర్‌ నారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Also Read: రూ.100 ఎక్కువ అడిగిందని సెక్స్ వర్కర్‌ని పొడిచి చంపేశాడు

శుక్రవారం బ్యాంకు పనివేళలు ముగిశాక తాళం వేసిన సిబ్బంది మళ్లీ సోమవారం ఉదయం సెక్యూరిటీ సమక్షంలోనే తెరిచారు. శనివారం సెలవు రోజైనా మేనేజర్‌ పురుషోత్తం బ్యాంకుకు వచ్చి విధులు నిర్వహించారని సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు తెలిపారు. ఉదయం బ్యాంకు తాళాలు తెరిచినప్పుడు తమకు ఎలాంటి అనుమానం రాలేదని, తాళాలన్నీ వేసినట్లే ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకు మేనేజరు వచ్చిన వెంటనే సీసీ కెమెరా సర్వర్‌ కనిపించలేదని చెప్పడంతో ఆయనపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై జోనల్‌ మేనేజర్‌ మురళీకృష్ణరావు, చీఫ్‌ మేనేజర్లు పంతులు, వర్మలు అంతర్గత విచారణ చేపట్టారు.

Also Read: అక్క ఇంటికొచ్చిన బాలికను గర్భవతిని చేసిన బావ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.