యాప్నగరం

మాస్క్‌ వేసుకోలేదని వివాదం.. గుంటూరు జిల్లాలో యువతి దారుణ హత్య

మొహానికి మాస్క్ ధరించే విషయంలో తలెత్తిన వివాదంలో నలుగురు యువకులు యలమంద కుటుంబంపై దాడి చేశారు. తల్లిదండ్రులను అడ్డుకునేందుకు వచ్చిన ఫాతిమాకు తలపై తీవ్ర గాయాలయ్యాయి.

Samayam Telugu 12 Jul 2020, 7:49 am
బయటికి వచ్చిన సమయంలో మాస్క్ ధరించలేదంటూ ఓ కుటుంబంపై స్థానికులు జరిపిన దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరు జిల్లా రెంటచింతలలో జరిగింది. 8 రోజుల క్రితం ఈ దాడి జరగ్గా బాధితురాలు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. రెంటచింతల మండల కేంద్రంలో ఉంటున్న కర్నాటి యలమంద రిక్షా కార్మికుడు. ఈ నెల 3న మొహానికి మాస్క్‌ ధరించకుండా బజారుకు వెళ్లిన అతడిని అన్నపరెడ్డి మల్లికార్జున, శ్రీను, వెంకటేశ్‌, సాంబ అనే నలుగురు స్థానికులు మందలించారు.
Samayam Telugu ఫాతిమా(ఫైల్ ఫోటో), ఆస్పత్రిలో విగతజీవిగా


Also Read: ‘కోరిక తీర్చకపోతే అంతు చూస్తా’.. ఏలూరులో వివాహితకు లైంగిక వేధింపులు

కాసేపటికి అదే బజారులో నలుగురు యువకులు మాస్కులు ధరించకుండా కనిపించడంతో యలమంద భార్య భూలక్ష్మి వారిని నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన ఆ యువకులు యలమంద కుటుంబంపై కర్రలతో దాడి చేశారు. తన తల్లిదండ్రులకు కొట్టొద్దంటూ అడ్డుగా వచ్చిన ఫాతిమా(19) తలపై బలంగా కొట్టారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

Also Read: తెలంగాణలో మరో డేరాబాబా... శిష్యుడితో కలిసి భక్తురాలిపై అఘాయిత్యం

అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఫాతిమా పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి యలమంద ఫిర్యాదు మేరకు నలుగురు యువకులు అన్నపరెడ్డి మల్లికార్జున, శ్రీను, వెంకటేశ్‌, సాంబపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రెంటచింతల ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు.

Also Read: ఉద్యోగాల పేరుతో మహిళల నిలువు దోపిడీ... విశాఖలో కేటుగాడు అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.