యాప్నగరం

బంజారాహిల్స్‌లో మహిళా ఆర్ట్ డైరెక్టర్‌పై మైనర్ల దాడి.. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ వికృత చేష్టలు

సినీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహిళ సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో కొంతదూరం నుంచి మరో కారులో ఆమెను వెంబడించిన యువకులు దాన్ని ఢీకొట్టారు.

Samayam Telugu 3 Dec 2019, 1:38 pm
హైదరాబాద్‌లో ‘దిశ’ ఘటనపై ఆగ్రహావేశాలు కొనసాగుతుండగానే బంజారాహిల్స్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహిళ కారును ఢీకొట్టిన ముగ్గురు మైనర్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను కారులో నుంచి బయటకు లాగి దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై బాధితురాలు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu pjimage (7)


Also Read: ‘ఫోటోలు వైరల్ చేస్తానన్నందుకే అతడితో వెళ్లా’ పోలీసులకు చెప్పిన మౌనిక

సినీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహిళ సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో కొంతదూరం నుంచి మరో కారులో ఆమెను వెంబడించిన యువకులు దాన్ని ఢీకొట్టారు. అందులోని మహిళ పట్ల వికృత చేష్టలకు పాల్పడుతూ.. అసభ్య పదజాలంతో దూషించారు. మైనర్ల కారులో ఉన్న ముగ్గురు మైనర్లతో పాటు మహిళలు బాధితురాలిపై దాడికి పాల్పడ్డారు.

Also Read: తండ్రి కాదు కీచకుడు.. కన్నకూతురినే గొలుసులతో బంధించి అత్యాచారం

ఈ ఘటనపై బాధితురాలు స్పందిస్తూ.. తనను కారులో నుంచి బయటకు లాగిన మైనర్లు దాడికి పాల్పడినట్లు తెలిపారు. వెనుక నుంచి కొడుతూ లో దుస్తులు చించేశారని చెబుతున్నారు. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. డయల్ 100కి రెండుసార్లు ఫోన్ చేసినా 40 నిమిషాల వరకు పోలీసులు రాలేదని ఆమె చెబుతున్నారు. తర్వాత స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా యాక్సిడెంట్ కేసుగా భావించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. తాను నిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలో పంజాగుట్ట సీఐ వచ్చి పరామర్శించారని, ఆమె ఆదేశాలతోనే బంజారాహిల్స్ పోలీసులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాధితురాలు తెలిపారు.

Also Read: ‘అమ్మా నాన్న క్షమించండి.. ప్రేమలో మోసపోయి చనిపోతున్నా’.. 10 పేజీల లేఖ రాసిన యువతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.