యాప్నగరం

నడిరోడ్డుపై వివాహితకు వేధింపులు.. అడ్డుకున్న భర్త, పోలీసులపై యువకుల దాడి

భర్తతో కలిసి కూరగాయలు కొనేందుకు వచ్చిన వివాహితను నలుగురు యువకులు వేధించారు. అడ్డుకున్న ఆమె భర్తను కత్తులు, కర్రలతో వెంటాడారు.

Samayam Telugu 7 Aug 2020, 9:03 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నలుగురు యువకులు గురువారం అరాచకం సృష్టించారు. వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ప్రశ్నించిన ఆమె భర్తపై వెంటాడి మరీ దాడి చేశారు. ప్రాణభయంతో అతడు పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి తలదాచుకున్నాడు. అయితే స్టేషన్‌లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన యువకుడు అడ్డుకున్న పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Samayam Telugu Image


Also Read: హైదరాబాద్: చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసిన ఇద్దరి అరెస్ట్

చుంచుపల్లి మండలానికి చెందిన దంపతులు కూరగాయలు కొనుగోలు చేయడానికి గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం రైతుబజార్‌కు వచ్చారు. కూరగాయలతో పాటు పండ్లు కొనుగోలు చేస్తుండగా ఓ యువకుడు మద్యం మత్తులో తూలుతూ వచ్చి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె భర్త యువకుడిని నిలదీయగా.. అతడి స్నేహితులు అజ్జు, అజీమ్‌, మున్ను, హమీద్‌లు కలిసి అతడిపై దాడికి తెగబడ్డారు. బాధితుడు వారి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేయగా కత్తులు, కర్రలతో నలుగురు వెంటాడి నడిరోడ్డుపై అతడిని చితకబాదారు.

Also Read: చేపల కూర వండలేదని... 9 నెలల గర్భిణిని కొట్టి చంపిన భర్త

వారి నుంచి తప్పించుకున్న బాధితుడు రైల్వే స్టేషన్‌ సమీపంలోని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో తలదాచుకొన్నాడు. దీంతో ఆ యువకులు స్టేషన్‌లోకి కూడా ప్రవేశించి హల్‌చల్‌ చేశారు. అడ్డుకోబోయిన ట్రాఫిక్‌ సిబ్బందిపైనా చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో మహిళ బాధితుడు, ఠాణా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: అమ్మాయిల పిచ్చే ప్రాణం తీసింది.. నెల్లూరు డాక్టర్‌ మృతిపై వీడిన మిస్టరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.