యాప్నగరం

ఏడేళ్ల బాలికను రేప్ చేసి చంపేసి.. సిమెంట్ డ్రమ్ములో వేసి

బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన కామాంధుడు ఆమెపై అత్యాాచారానికి పాల్పడిన ప్రాణం తీశాడు. ఆమె శవం కనిపించకుండా చేసేందుకు ఫ్రెండ్ సాయంతో డ్రమ్ములో వేసి కాంక్రీట్ నింపి ఓ చోట పడేశాడు.

Samayam Telugu 12 Dec 2019, 4:50 pm
మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు ఆమెను కిరాతకంగా చంపేసి స్నేహితుడి సాయంతో సిమెంట్ కాంక్రీట్‌లో వేసి ఖననం చేసేశాడు. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని ఉత్తాన్ జిల్లాలో వెలుగుచూసింది.
Samayam Telugu girl rape


Also Read: ప్రియురాలిని చంపి, శవాన్ని ముక్కలుగా నరికి... జిమ్ యజమాని పైశాచికం

ఉత్తాన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో గొంతు నులిచి చంపేశాడు. బాలిక శవం దొరక్కుండా ఉండేందుకు తన స్నేహితుడిని సాయం కోరాడు.

Also Read: టెన్త్ క్లాస్ బాలికపై బీహారీల అఘాయిత్యం.. తీవ్ర రక్తస్రావం కావడంతో

వారిద్దరు కలిసి బాలిక శవాన్ని ఓ భవన నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లి ప్లాస్టిక్ డ్రమ్ములో వేశారు. సిమెంట్ కాంక్రీట్‌తో ఆ డ్రమ్మును నింపి ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బాలిక శవాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరికి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: పార్కులోనే బాలికపై అత్యాచారం.. హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.