యాప్నగరం

మరొకరిని మింగేసిన భయం.. కరోనా వచ్చిందేమోనని.. గుంటూరులో విషాదం

తన కుమారుడికి కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. తనకూ కరోనా వచ్చిందేమోనన్న అనుమానంతో వృద్ధుడు మానసికంగా కుంగిపోయాడు. అదే భయంతో చివరికి ప్రాణాలు తీసుకున్నాడు.

Samayam Telugu 16 Aug 2020, 9:48 pm
కరోనా భయం మరొకరిని మింగేసింది. కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకు కూడా కరోనా సోకి ఉంటుందన్న భయంతో ఏడుపదులు దాటిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు పట్టాలపై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటుచేసుకుంది.
Samayam Telugu రైల్వే ట్రాక్‌పై ధనుంజయ మృతదేహం
suicide


బాపట్ల మండలంలోని అప్పకట్ల గ్రామానికి చెందిన ఇనగంటి ధనుంజయ(72) తన కుమారుడితో కలసి గ్రామంలో నివసిస్తున్నాడు. ఇటీవల కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తెనాలి కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనకు కూడా కరోనా సోకి ఉంటుందన్న భయంతో ధనుంజయ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయిన ధనుంజయ తిరిగి ఇంటికి రాలేదు.

Read Also: కోడలిపై కన్నేసిన కీచక మామ.. కోరిక తీర్చమంటూ.. కామారెడ్డిలో దారుణం

మరుసటి రోజు ఉదయం బాపట్ల పట్టణానికి సమీపంలో రైల్వే ట్రాక్‌పై వృద్ధుడి మృతదేహం కనిపించింది. ట్రాక్‌పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియడంతో ఆయన పెద్దకుమారుడు వచ్చి తండ్రిని గుర్తించారు. అనంతరం వృద్ధుడి మృతదేహానికి కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ నిబంధనల ప్రకారం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రియురాలిని చంపి.. పెన్ను, పేపర్ అడిగిన హంతకుడు.. అవాక్కైన పోలీసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.