యాప్నగరం

మహిళలపై నేరాల్లో టాప్-5లో తెలంగాణ.. తగ్గిన హత్యలు.. పెరిగిన కిడ్నాప్‌లు

2018లో తెలంగాణలో రాష్ట్రం మహిళలపై నేరాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. హత్యలు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా.. కిడ్నాప్‌లు పెరిగాయి. వరకట్న వేధింపులతో 186 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు.

Samayam Telugu 10 Jan 2020, 11:19 am
2018లో మహిళలపై జరిగిన నేరాల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. మహిళలపై నేరాలకు సంబంధించి ఆ సంవత్సరంలో మొత్తం 16,027 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల వల్ల 186 మంది మృతిచెందగా, 10 మందిపై యాసిడ్ దాడి జరిగింది. వేధింపులు ఇతర కారణాలతో 459 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆరుగురు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2018 నివేదిక వెల్లడించింది. మహిళలపై నేరాల సంఖ్య 2017లో పోలిస్తే 2018లో కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.
Samayam Telugu crime


Also Read: భర్త కళ్లుగప్పి ఆరేళ్లుగా అక్రమ సంబంధం.. నిజం బయటపడటంతో ప్రియుడితో కలిసి

దేశవ్యాప్తంగా ఐపీసీ సెక్షన్ల కింద 31,32,954 కేసులు నమోదవగా తెలంగాణలో వాటి సంఖ్య 1,13,951గా ఉంది. 2017లో ఐపీసీ కింద నమోదైన కేసుల సంఖ్య 1,19,858 కాగా మరుసటి ఏడాదిలోనే 5,907 కేసులు పెరిగాయి. ఐపీసీ కింద నమోదైన నేరాల్లో 19 నగరాల జాబితాలో హైదరాబాద్‌కు 11వ స్థానం దక్కింది. మహిళలపై నేరాల్లో మాత్రం ఐదో స్థానంలో నిలిచింది.

Also Read: ఒంగోలులో దారుణం.. ప్రియుడిని కొట్టి యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం!

18 ఏళ్లలోపు వయసు కలిగి కనిపించకుండా పోయిన వారికి సంబంధించి 3,090 కేసులు నమోదు కాగా.. వీరిలో 75 శాతం మందిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. తెలంగాణలో 2017లో 805 హత్యలు జరగ్గా 2018లో ఆ సంఖ్య 786కు తగ్గింది. 2017లో 1,560 కిడ్నాప్‌‌లు జరిగితే.. 2018లో ఆ సంఖ్య 1,810కి పెరిగింది. అవినీతి నిరోధక చట్టం కింద 139 నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.160.6కోట్ల సొమ్ము చోరీకి గురికాగా.. పోలీసులు రూ.113.4 కోట్లు రికవరీ చేశారు.

Also Read: సెక్స్‌వర్కర్‌గా మారిన లేడీ జైలర్.. ఖైదీకి సెక్స్ సుఖం అందించి డబ్బులు వసూలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.