యాప్నగరం

సమత కేసు: ముగిసిన వాదనలు.. జడ్జిమెంట్ ఎప్పుడంటే..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సమత కేసులో వాదనలు పూర్తయ్యాయి. సాక్షులను విచారించిన ప్రత్యేక కోర్టు తీర్పు తేదీని ప్రకటించింది.

Samayam Telugu 20 Jan 2020, 7:32 pm
కుమ్రంబీమ్ జిల్లాలో హత్యాచారానికి గురైన సమత కేసులో వాదనలు సోమవారంతో ముగిశాయి. గతేడాది నవంబర్ 24న లింగపూర్ మండలం ఎల్లపటార్ గ్రామంలో సమతపై ముగ్గురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. అదే సమయంలో దిశ ఘటన కూడా జరగడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
Samayam Telugu samatha


సమత హత్యాచార ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు గతేడాది డిసెంబర్‌లో సాక్ష్యులను విచారించింది. ఈ రోజుతో వాదనలు ముగియడంతో తీర్పును ఈ నెల 27వ తేదీన వెల్లడించనున్నట్లు ప్రకటించింది.

Also Read: CISF: కానిస్టేబుల్ కూతురిపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం..

నిందితులు షేక్ బాబా, షేక్‌ షాబుద్దీన్‌, షేక్ ముఖ్దీమ్‌లలను అదుపులోకి తీసుకున్న పోలీసులు నవంబర్‌ 27న కోర్టులో హాజరు పరిచారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు అనంతరం డిసెంబర్‌ 14న పోలీసులు చార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 48 మంది సాక్షులలో 25 మందిని కోర్టు విచారించింది. ఈ నెల 27న తీర్పు వెలువరించనుంది.

Read Also: క్రాఫ్ చేయించుకోమన్నందుకు ఉరేసుకున్న టీనేజర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.